calender_icon.png 17 December, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగ గురువు ఉమారాణికి.. డాక్టరేట్, డైనమిక్ యోగా అవార్డు

17-12-2025 04:48:36 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన యోగా గురువు బోయ ఉమారాణి అరుదైన డాక్టరేట్, డైనమిక్ యోగ అవార్డులను అందుకున్నారు. ప్రముఖ యోగ గురువురాలు బోయ ఉమారాణికి గౌరవ డాక్టరేట్, డైనమిక్ యోగ అవార్డ్స్ ను మ్యూజిక్ బుక్ ఆఫ్ రికార్డు వారు అందచేశారు. ఈ నెల 13న మ్యూజిక్ బుక్ ఆఫ్ రికార్డు చైర్మన్ డాక్టర్ సీపీ యాదవ్ అవార్డుల్ని అందచేశారు. ఉమారాణి గత 25 సంవత్సరాలుగా అంకిత భావంతో యోగా నేర్పిస్తూ ఎంతోమందికి ఆరోగ్యపరంగా ఉపయోగపడుతున్నారు. యోగా మాస్టర్ గా చేసిన కృషితో ఎంతో మందికి యోగా అభ్యసింపచేశారు. యోగా కృషినీ చూసిన తెలంగాణ యోగ ప్రచార సమితి రాష్ట్ర కమిటీ వారు వెన్నంటే  ఆమెను ప్రోత్సహించారు.

వారిని కృషిని గమనించి మ్యూజిక్ బుక్ ఆఫ్ రికార్డు చైర్మన్ డాక్టర్ సీపీ యాదవ్ ఈ అవార్డులకి ఎంపిక చేశారు. డాక్టర్ రాజేంద్ర శైని, డాక్టర్ రామ అవతార్ శర్మ, డాక్టర్ హరి ఓం శర్మ, ఆర్పి హ్యాండ్, డాక్టర్ నిరంజన్ బిసి ఈ అవార్డు ఉత్సవంలో పాల్గొన్నారు. అవార్డు గ్రహీత ఉమారాణి దగ్గర శిక్షణ పొందిన సాధకులు, అభిమానులు ఉమారాణిని ప్రశంసించారు. అవార్డు గ్రహీత ఉమారాణి మాట్లాడుతూ అవార్డు రావడానికి తమ దగ్గర శిక్ష పొందిన సాధకులు అభిమానులతో పాటు తెలంగాణ యోగ ప్రచార సమితి రాష్ట్ర కమిటీ  ప్రధాన కారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రచార సమితి వెన్నంటే ఉంటూ ప్రోత్సహించారన్నారు. అవార్డులు అందుకున్న సందర్భంగా  తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.