calender_icon.png 17 December, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్

17-12-2025 04:39:14 PM

హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఐదు మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. ఐదు మంది ఎమ్మెల్యేల బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చారు.  పార్టీ మారినట్లు ఆధారాలు చూపలేకపోయారని, ఎమ్మెల్యేలు తెల్లాం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లరె స్పీకర్ ప్రసాద్ కొట్టేశారు. రేపు మరో ముగ్గురు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పు ప్రకటించనున్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ ప్రసాద్ ఇచ్చిన నోటీసులకు వారు ఇంకా స్పందించకపోవడంతో విచారణ ఇంకా పూర్తికాలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు గడువు రేపటితో ముగియనుంది.