17 April, 2026 | 2:39 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

29-05-2025 02:30 AM

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

హనుమకొండ, మే 28 (విజయ క్రాంతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రైతును రాజుగా చేసే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని  స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

బుధవారం రఘునాథ్ పల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో 33/11 కె.వి సబ్ స్టేషన్ నిర్మాణ భూమి పూజ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేశారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న నూతన సబ్ స్టేషన్ ల ద్వారా మండల గ్రామాల పరిధిలోని గృహ, వ్యవసాయ భూములకు కరెంట్ కష్టాలు తీరనున్నాయని అన్నారు.

పేద ప్రజలకు, రైతులకు సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తుందని తెలియజేశారు.  ఎంపీ నిధులనుండి ఐదు లక్షల రూపాయలతో మహిళ కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంజూరు ఇస్తానన్నారు.

మల్లన్న సాగర్ నుండి కుర్చపల్లికి వచ్చే కాల్వపనులు ముమ్మరంగా సాగుతున్నా యని, వాన కాలంలోగా కుర్చపల్లిలోని చెరువులు, కుంటలు నింపి ప్రతి పంటకు సాగునీరు అందజేస్తానని  తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాంబాబు, మరియు ఎమ్మార్వో, ఎంపీడీవో, విద్యుత్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.