17 April, 2026 | 4:10 PM

వర్షానికి తెగిపోయిన డైవర్షన్ రోడ్డు

29-05-2025 02:28 AM

ఏజెన్సీలో నిలిచిపోయిన రాకపోకలు 

మహబూబాబాద్, మే 28 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతంలో కొత్తగూడా కొండంపల్లి రహదారిలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొండ్రాయి గూడెం వద్ద డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. దీనితో ఏజెన్సీ ప్రాంతంలోని తిమ్మాపురం ఆదిలక్ష్మి పురం తో పాటు మరో ఐదు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.

మొండ్రా యి గూడెం వద్ద వాగు పై లో లెవెల్ బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. ఇందుకోసం పాత బ్రిడ్జిని తొలగించి తాత్కాలికంగా రాకపోకల కోసం డైవర్షన్ రోడ్డు వేశారు. వర్షాలకు వచ్చిన వరదకు డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయి జనజీవనానికి తీవ్ర ఇబ్బందిగా మారింది.