8 June, 2026 | 1:29 AM

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

08-06-2026 12:00 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

కడ్తాల్, జూన్ 7, (విజయక్రాంతి ): పేద ల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో సంక్షేమానికి కొత్త దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు కు సాగుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఆదివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ దవాఖానాలో చికిత్స పొందుతున్న మైసిగండి మాజీ సర్పంచి శేఖర్ గౌడ్ ని పరామర్శించారు. అనంతరం మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో  ఆయా మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.