16 July, 2026 | 1:00 AM

పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

16-07-2026 12:59 AM

విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, జూలై 15, (విజయ క్రాంతి): ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వేములవాడ పట్టణానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు రూ.13.57 లక్షలు, వేములవాడ అర్బన్ మండలానికి చెందిన 18 మందికి రూ.5.66 లక్షలు అందజేశారు.

మొత్తం 55 మంది లబ్ధిదారులకు రూ.19.23 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఆసరాగా నిలుస్తోందన్నారు. అనారోగ్య బాధితులకు వేగంగా ఆర్థిక సాయం అందించడం వల్ల వైద్య ఖర్చుల భారం తగ్గుతోందని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్నా ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు..