ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకకు యువత ఉద్యమించాలి
ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర
ఘట్ కేసర్, ఆగస్టు 3 (విజయక్రాంతి): విద్యా రంగంలోని సమస్యలు యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఏఐవైఎఫ్ ఘట్కేసర్ మండల 3వ మహాసభ అన్నోజీగూడలో సోమవారం జరిగింది.
మండల కార్యదర్శి సంపంగి సదాశివ అధ్యక్షతన జరిగిన సభలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ స్థానిక ఉపాధి అవకాశాల కొరత, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల లేమి, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల సమస్యలు, యువతకు క్రీడా సాంస్కృతిక వేదికల కొరత వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేసి యువతకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సల్మాన్ బేగ్, కార్యదర్శి టి. సత్య ప్రసాద్ కూడా ప్రసంగించారు. ఈమహాసభలో సీపీఐ ఘట్కేసర్ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, ఏఐవైఎఫ్ మండల కార్యవర్గ సభ్యులు సతీష్, యాదగిరి, ఆంజనేయులు, శ్రీను, సాయి పాస్వాన్, శివ, భరత్, మధు, అనీల్, ప్రదీప్, రెహ్మాన్, జాన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.






