28 April, 2026 | 2:24 AM

యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

28-04-2026 12:00 AM

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

గద్వాల టౌన్, ఏప్రిల్ 27 : యువత ఉ ద్యోగ, ఉపాధి అవకాశాలను పొందేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని అద నపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా క్రీడా, యువజన సర్వీసు ల శాఖ ఆధ్వర్యంలో మే 18 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికలను సోమ వారం ఐడిఓసి సమావేశపు మందిరంలో అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆర్డీ వో శ్రీనివాసరావు, ఇన్చార్జి డివైఎస్‌ఓ రామలింగేశ్వర గౌడ్, ఇతర అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.