28 April, 2026 | 2:14 AM

ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు

28-04-2026 12:00 AM

మేడ్చల్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): జిల్లాలో ఫీల్డ్ కార్యకలాపాల కోసం ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సి ఉమా గౌరీ తెలిపారు. 34 ఆరోగ్య మిత్ర పోస్ట్‌లు అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తామని, ఏదైనా డిగ్రీతో పాటు డిసిఏ కలిగి, కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులని తెలిపారు. కేవలం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్థానిక అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఈనెల 28, 29 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు పత్రాలను కలెక్టరేట్ లోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు ఫారంతో పా టు అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు, రూ.500 డిడి జత చేయాలని సూచించారు. ఎంపికైనవారు సనత్‌నగర్‌లోని టీమ్స్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.