28 April, 2026 | 2:19 AM

గోపల్దిన్నెలో గడ్డివాములు దగ్దం

28-04-2026 12:00 AM

అలంపూర్ ఏప్రిల్ 27: ఆరు గాలం శ్రమంచి పశువుల కోసం పోగు చేసుకున్న గ్రాసం అగ్నికి ఆహుతైంది.స్థానికులు తెలిపిన మేరకు... ఇటిక్యాల మండలం గోపల్దిన్నె గ్రామానికి చెందిన బోయ రంగస్వామి గ్రామ సమీపంలో గల దొడ్లలో 8 ట్రాక్టర్ తో కూడిన రెండు గడ్డి వాములు వేసుకున్నారు.అయితే సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు వ్యాపించి కాలిపోవడంతో రైతు కన్నీమున్నీరయ్యారు. మంటల ను చూసిన గ్రామస్తులు ఆర్పేందుకు ప్రయత్నించారు . మంటలను అదుపు చేయడం గ్రామస్తులకు సాధ్యం రాకపోవడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునే లోపు రూ. 1.30 లక్షల విలువైన గడ్డి వాములు కాలి బూడిదయ్యా యి. బాధిత రైతును ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.