జ్యువెలరీ షాపులో చోరీ
09-08-2026 01:31 PM
బంగారం, వెండి ఆభరణాలు అపహరణ
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కాగజ్‌నగర్(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ బంగారు నగల దుకాణంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు బంగారం, వెండి ఆభరణాలను అపహరించినట్లు సమాచారం.చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాల విలువ ఎంత అన్న దానిపై దుకాణ యజమాని నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






