15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

హాజీపూర్ తండా ఆలయంలో చోరీ

16-06-2025 12:00 AM

ఎల్లారెడ్డి, జూన్ 15 (విజయక్రాంతి): ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని హాజీపూర్ తాండలోని జగదాంబ మాత, సేవాలాల్ ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. తాండ వాసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తాండలో ఉన్న జగదాంబ మాత, సేవాలాల్ ఆలయంలో పూజారి దుప్య నాయక్ రోజువారి లాగే  పూజలు నిర్వహించి అనంతరం అలయానికి తాళం వేసి వెళ్లారు. కాగా  అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయంలో ఉన్న హుండీ గొలుసుతో వేసిన తాళాన్ని విరగొట్టి ఆలయంలోకి చొరబడి సూమారు రూ.30వేలు నగదును అపహరించారు. 

ఆదివారం ఉదయం ఆల య పూజారి దుప్య నాయక్ వచ్చి చూడగా ఆలయంలో ఉన్న హుండీ కనిపించకపోవడంతో తాండ వాసులకు సమాచారం ఇచ్చా రు. అనుమానం వచ్చి ఆలయం చుట్టూ పక్కల చూడగా ఆలయం పక్కన హుండీ తాళాలు పగలగొట్టి ఉండడంతో అందులో నగదు కనిపించలేదు. దీంతో ఆలయంలో చోరీ జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు క్లూస్ టీంకు సమాచారం ఇచ్చారు.