16-06-2025 12:00:00 AM
పటాన్ చెరు, జూన్ 15 : అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని గండిగూడెం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆధివారం విద్యార్థులకు కరాటే పోటీలు నిర్వహించారు. జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరేశ్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ షావలిన్ కుంగ్ ఫు, కరాటే పోటీలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి శిక్షణలు విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. బాలికల స్వీయ రక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.