నేను గర్వంగా చెప్పుకోలేని సినిమాలు బోలెడు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న కొత్తచిత్రం ‘మా ఇంటి బం గారం’. నందినీరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కథను ప్రముఖ దర్శకుడు, సమంత భర్త రాజ్ నిడిమోర్ అందించారు. సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ విడుదలై, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో టీమ్ ఇప్పుడు ప్రమో షన్లను పరుగులు పెట్టిస్తోంది.
ఇందులో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సమంత తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తాను గర్వంగా చెప్పుకోలేని ఎన్నో సినిమా ల్లో నటించానంటూ సామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. “నన్ను ప్రజలు చాలా తక్కువ టైమ్‌లోనే ఎంతగానో ఆదరించారు.. ఉత్సాహంగా నా పేరును కేకలు వేస్తూ పిల వడం, నా సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు.
ఇదంగా చూసి నేను ఆశ్చర్య పోయా. ఆ స్టార్‌డమ్ అనే మాయలో మునిగిపోయా. అంతేకాదు, మీడియా నా గురించి రాస్తోంది. ఏడాదికి నేను ఎన్ని సినిమాల్లో నటించాననే విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపించేదాన్ని. హిట్ సినిమాలు, బ్లాక్‌బస్టర్ సినిమాలను అందిస్తున్నా, అసలు సిని మాకు ఏం ఇస్తున్నానని ఎప్పుడూ ఆలోచించలేదు. నేను గర్వంగా చెప్పుకోలేని సినిమాలెన్నో” అని చెప్పుకొచ్చింది సమంత.






