హింసాత్మక చర్యలకు స్థానం లేదు
నిజామాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ నేతలు నిర్వహించిన దాడి ఘటన నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆయనను పరామర్శించారు. సోమవారం ఆయన నివాసానికి వెళ్లి ధన్పాల్ సూర్యనారాయణ. మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో హింసాత్మక చర్యలకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దాడులకు పాల్పడన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ఆయనకు,కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని దాడులకు పాల్పడిన వారిపై పరమైన చర్యలు తీసుకోవాలని ధన్పాల్ సూర్యనారాయణ సీపీని కోరారు.




