దిందా గ్రామస్తుల స్వప్నం నెరవేరనుంది
24-02-2026 01:09 AM
ఎమ్మెల్యే డా.హరీష్‌బాబు
బెజ్జూర్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): చింతలమానేపల్లి మండలం దిందా గ్రామ శివారులోని వాగుపై రూ.5 కోట్ల అంచనాతో నిర్మాణం చేపడుతున్న వంతెన పనులను సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా వంతెనతో పాటు అప్రోచ్ రోడ్డుపై కూడా సీసీ రోడ్డు నిర్మించాలని ఆదేశించారు.
కాంట్రాక్టర్లు, అధికారులకు పలు సూచనలు చేశారు. వంతెన నిర్మాణంతో దిందా గ్రామస్తుల చిరకాల స్వప్నం నెరవేరుతుందన్నారు. ఆర్ అండ్ బీ రోడ్ నుంచి దిందా గ్రామం వరకు బీటీ రోడ్డు రీన్యూవల్కు మంజూరు చేస్తామని, పోడు భూముల సమస్యలను కూడా ఉన్నతాధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.




