20 May, 2026 | 3:45 AM

‘పెద్ది’లో మరికొన్ని ఆటలు!

20-05-2026 01:24 AM

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరో గా నటిస్తున్న ‘పెద్ది’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు మూవీటీమ్ వదిలిన ప్రచార చిత్రాల్లో క్రికెట్, కుస్తీ, రెజ్లర్‌గా కనిపించిన రామ్‌చరణ్.. మరికొన్ని క్రీడల్లో నూ పాల్గొనే ఆట కూలిగా అలరించనున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వార్త ఇప్పుడు అందరిలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న మూవీ ట్రైలర్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ ట్రైలర్ విడుదలైన క్షణం నుంచే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో వ్యూస్ సాధిస్తూ దూసుకెళ్తోంది. విడుదలైన తొలి 24 గంటల్లోనే ట్రైలర్ 100 మిలియన్ మార్క్‌ను దాటి 101 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. ఈ ఫీట్‌ను అత్యంత వేగంగా అందుకున్న తెలుగు ట్రైలర్‌గా కొత్త రికార్డ్ సృష్టించింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వెంకట సతీశ్ కిలారు భారీ స్థాయిలో నిర్మించారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు; ఎడిటర్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.