29 August, 2026 | 12:39 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం

12-01-2025 06:03 PM

కరీంనగర్: కరీంనగర్ కలెక్టరేట్(karimnagar collectorate) లోని జిల్లా సమీక్ష సమావేశం(District review meeting) ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదంతో రసాభాసంగా మారింది. ఈ సమీక్ష సమావేశంలో జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) మాట్లాడేందుకు సిద్దమవ్వగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) ఆయనకు మైక్ ఇవ్వొద్దని అడ్డుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తనకు మైక్‌ ఎందుకు ఇవ్వొద్దని ప్రశ్నించారు. నీది ఏ పార్టీ అని పాడి కౌశిక్‌రెడ్డి సంజయ్ పై దుర్భాషలాడి ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని జిల్లా సమీక్ష సమావేశం నుంచి బయటకు పంపించారు. ఎమ్మెల్యే సంజయ్ కి ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఈ తోపులాట మంత్రులు ఉత్తమ్ కుమార్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమక్షంలోనే వాగ్వాదం జరగడంతో హట్ టాపిక్ గా మారింది. కౌశిక్‌రెడ్డి తీరుపై మంత్రి శ్రీధర్‌ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.