ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ
29-08-2026 12:36 PM
బోథ్. ఆగస్టు 30(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని మైసమ్మ కాలనీలో ఉన్న కేదారినాథ్ శివాలయం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సాధ్యమైనంత తొందరలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపించే ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జై నూర్ నారాయణ. పాలిక్ రమేష్ తూము గంగయ్య, మాసం అనిల్ కుమార్ ,తాడేపు నరేష్, నరంశెట్టి, ప్రకాష్ కమటం ఆకాష్, కటకం మల్లికార్జున్ లుపాల్గొన్నారు.






