4 July, 2026 | 4:41 PM

జీపీఎస్‌ను నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్నారు

25-11-2024 02:38 AM

ఉత్తరప్రదేశ్‌లోని బరెలీలో ఘటన

లక్నో, నవంబర్ 24: గూగుల్‌ను గుడ్డిగా నమ్మి ముగ్గరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరెలీ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. బరెలీ నుంచి డేటాగంజ్‌కు ముగ్గరు వ్యక్తులు కారులో బయల్దేరారు. ఈ క్రమంలోనే వాళ్లు జీపీఎస్‌ను ఫాలో అవుతూ రామ్‌గంగా నదిపై ఉన్న వంతెనపైకి వెళ్లారు. అయితే నిర్మాణంలో ఉన్న ఆ వంతెన కొన్ని నెలల క్రితం సంభవించిన భారీ వరదల కారణంగా కొట్టుకుపోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు నదిలో పడిపోయింది. దీంతో కారులోని ముగ్గురూ మరణించారు.