24 August, 2026 | 11:36 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

ఎవరి పాత్ర పేరేంటో చెప్పేశారు!

28-07-2024 12:05 AM

స్టార్ హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘సరిపోదా శనివారం’. సినిమా పేరు తగ్గట్టుగా వారాంతంలో సినిమా గురించిన ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం నుంచి ఇటీవల నాట్ ఏ టీజర్ వీడియో విడుదల చేసిన చిత్రబృందం తాజాగా శనివారం సినిమాలోని కీలక పాత్రల ఫస్ట్‌లుక్స్‌ను రిలీజ్ చేశారు. భద్రగా అదితీబాలన్, గోవర్ధన్‌గా అజయ్, కూర్మానంద్‌గా మురళీశర్మ, నారాయణ ప్రభగా అజయ్ ఘోష్ క్యారెక్టర్స్‌ను పరిచయం చేశారు.

ఇంకా ఈ సినిమాలో మార్టిన్ ‘కాళి’గా, హర్షవర్ధన్ ‘సుధ’గా, శుభలేఖ సుధాకర్ ‘కమలాకర్’గా నటిస్తున్నట్టు పరిచయ చిత్రాలను విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రత్యేకంగా కనిపించే ‘సోకులపాలెం’కు సంబంధించి ఆకర్షణీయమైన పోస్టర్‌ను కూడా రివిల్ చేశారు. ‘మార్ డాలా’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన హీరో నానిని సూర్యగా పరిచయం చేసింది చిత్రబృందం. ఈ సినిమాను ఆగస్టు 29న మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది.