రేవంత్, కేసీఆర్‌కు అధికారం దాహం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): అధికారం కోసం కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఎంతకైనా తెగిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ అభ్యర్థి జీ కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఇద్దరు నేతలు అబద్ధాలను ప్రచారం చేయడంలో ఆరితేరారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. అవినీతికి మారుపేరే కాంగ్రెస్ అని విమర్శించారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్లు రేవంత్‌రెడ్డి రోడ్లపై ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారని, ఉచిత బస్సు తప్పితే మిగతావి ఎక్కడ అమలవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
వాస్తవానికి కాంగ్రెస్ పాలనలో చెప్పడానికి ఏమీ లేదని, అందుకే బీజేపీపై అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి నిజస్వరూపం తేటతెల్లమైందన్నారు. ఐదు నెలల పాలనలో రేవంత్‌ర్డెడి ఏం ఉద్ధరించారో తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. రాష్ట్రానికి కేసీఆరే ప్రమాదకారి అనుకుంటే రేవంత్‌రెడ్డి అంతకుమించి ఉన్నారని విమర్శించారు. అబద్ధాలను ఇంటిపేరుగా మార్చుకొని కాంగ్రెస్ 75 ఏళ్లుగా దేశంలో రాజకీయాలు చేస్తోందన్నారు.
ఇద్దరిలో అదే అహంకారం..
కేంద్రం సహకారం అందిస్తోందని, వారితో సత్ససంబంధాలను కొనసాగిస్తామని అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి చెప్పారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. కానీ ఎన్నికలు రాగానే మాటమార్చారని మండిపడ్డారు. రేవంత్ కూడా కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారన్నారు. ఇద్దరిలో అదే అహంకారం కనపడుతోందన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని, జీతాలు ఇవ్వలేని స్థితికి తీసుకుపోయి, రాష్ట్రాన్ని దివాలా తీయించార న్నారు. వచ్చే ఐదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటే రాష్ట్రం పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశా రు.
1వ తేదీన జీతాలు ఇస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్.. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కారంలో విఫలమైందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పెన్షనర్లకు కరువుభత్యాలను చెల్లించలేదని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో పయనిస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమని రేవంత్‌రెడ్డి అనడంపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగెస్ పార్టీ తెలంగాణను క్యాన్సర్‌లా పట్టి పీడిస్తోందని, ఇంకో ఆరు నెలల తర్వాత ఆ పార్టీకి ఎందుకు ఓటేశామా? అని తెలంగాణ ప్రజలు బాధపడే పరిస్థితి వస్తుందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటైపోయి బీజేపీపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని ఆదరించాలని, దానికి నాందిగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారంపై కిషన్ రెడ్డి మండిప్డడారు. పేదలకు గత ముడున్నరేళ్లుగా ఇస్తున్న బియ్యం.. కేంద్రం కట్టించిన టాయిలెట్లు.. రైతులకు మోదీ ఇస్తున్న డబ్బులు.. పీఎం సడక్ యోజన కింద గ్రామాల్లో వేసిన రోడ్లు.. 2,500 కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణం.. రైతులకు ఇచ్చే సబ్సిడీ ఇవన్నీ రేవంత్‌రెడ్డికి గాడి గుడ్డులా కనిపిస్తున్నాయా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.