సొంతూర్లకు నగరవాసులు
ఖాళీ అవుతున్న హైదరాబాద్
ఏపీకి తరలిన సీమాంధ్రులు
ఓటింగ్ శాతంపై ప్రభావం
ఏ పార్టీకి నష్టమని చర్చ
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న ఒకేసారి జరగనుండటంతో నగర వాసులు సొంతూర్ల బాటపట్టారు. ఏపీతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన దాదా పు 10 లక్షల మంది హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో వీరంతా తమ సొంతూర్లకు వెళ్తున్నారు. సీమాంధ్ర ప్రజలు ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీకి కలిపి రెండు ఓట్లు వేయాల్సి ఉండటంతో సొంత గ్రామాల్లోనే ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
వ్యయప్రయాసలకోర్చి ఓటు వేసేందుకు వెళ్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఉండే పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజ యం సాధించి.. అధికారంలోకి వచ్చిన విష యం తెలిసిందే. గ్రేటర్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించకపోవడంతో ఒక్క సీటులోనూ విజయం సాధిం చలేదు.
బీజేపీ గోషామహాల్‌లో విజయం సాధించగా, మిగతా అన్ని సీట్లలో బీఆర్‌ఎస్ గెలుపొందింది. ఒక్కో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు 50 వేల నుంచి 80 వేల వరకు మెజార్టీ వచ్చింది. అంటే గ్రేటర్ పరిధిలోని సీమాం ధ్ర ఓటర్లు బీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపారని స్పష్టమైందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. సీమాంధ్రులకు రెండు రాష్ట్రాల్లో ఓటు ఉండటంతో ఇప్పుడు ఏపీలోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
పోలింగ్ తగ్గితే.. నష్టం ఎవరికో
సీమాంధ్ర ఓటర్లు ఏపీకి వెళ్తుండటంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలు జాతీయ స్థాయి ఎన్నికలు అయినందున కాంగ్రెస్ లేదా బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉండేదని చెప్తున్నారు. సీమాంధ్ర ఓటర్లు బీజేపీ విషయంలో పెద్దగా ఆసక్తిగా చూపరని, గతంలో కాంగ్రెస్ వైపే నిలిచిన విషయాన్ని కొందరు కాంగ్రెస్ నేతలే గుర్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విధంగానే.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఇండియా కూటమి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో దాదాపు గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గాల్లోని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓటింగ్ శాతం కూడా భారీగా తగ్గే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అంతిమంగా బీఆర్‌ఎస్, బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా నష్టం జరిగే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు.
కిక్కిరిసిన బస్సులు, రైళ్లు
వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయ గా, ప్రత్యేక రైళ్లతోపాటు రైళ్లకు అదనపు కోచ్‌లను దక్షణిమధ్య రైల్వేశాఖ ఏర్పా టు చేసింది. మరో వైపు ప్రయాణికుల రద్దీతో ప్రయివేట్ ట్రావెల్స్ నిర్వాహకు లు రెట్టింపు ధరలతో ప్రయాణికులను దోచుకుంటున్నారు. టోల్‌గేట్ల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నాయి.