తేజా కోసం ఆడి పాడుతారట..
చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన చిత్రాల్లో ‘హను మాన్’ ఒకటి. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంతో తేజాకు హీరోగా మంచి హైప్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ‘మిరాయ్’ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి చాలా మంది స్టార్ నటీనటులను తీసుకున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ చిత్రంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ నటి శ్రియ శరన్ కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్ శ్రీయ శరన్ ఆడి పాడనున్నారని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని చెబుతున్నారు.






