కిల్లర్రెండో షెడ్యూల్ షురూ
దర్శకుడు పూర్వాజ్ ప్రస్తుతం ‘కిల్లర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఆయన వన్ ఆఫ్ది హీరోగా కనిపిస్తారు. ఏయూ అండ్‌ఐ, మెర్జ్ ఎక్స్‌ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఏ పద్మనాభరెడ్డి కొలాబరేషన్‌లో నిర్మాణమవుతున్న రెండో చిత్రమిది. ‘కిల్లర్’ పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. 10 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో హీరో పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్, ప్రధాన తారాగణం పాల్గొన్నారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో మరో హీరో విశాల్ రాజ్ పాల్గొంటారు. రామోజీ ఫిల్మ్ సిటీ, మనోహరాబాద్ ప్రాంతాల్లో జరిగే రెండో షెడ్యూల్‌లో యాక్టర్ గౌతమ్‌తోపాటు జ్యోతి పూర్వజ్ కూడా భాగం అవ్వనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జగదీశ్ బొమ్మిశెట్టి; సంగీతం: అషీర్ ల్యూక్, సుమన్ జీవరతన్.






