24 March, 2026 | 11:09 PM

గోడదూకి వచ్చి.. బైక్ ఎత్తుకెళ్లిన దొంగలు

24-03-2026 09:29 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పాత సారపాకకు చెందిన పోట్రు అనిల్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు తెల్లవారుజామున 3 గంటల సమయంలో చేతివాటం ప్రదర్శించారు. ఇంటి గోడ దూకి లోపలికి ప్రవేశించిన దుండగులు, వరండాలో పార్కింగ్ చేసి ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను అపహరించుకుపోయారు. దొంగలు గోడ దూకుతున్న దృశ్యాలు, బైక్ ఎత్తుకెళ్తున్న తీరు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.