12 June, 2026 | 2:26 AM

అంతం..ఒప్పందం!

12-06-2026 01:44 AM

శాంతి ఒప్పందానికి ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటన

అంతకుముందు భీకర దాడులు చేస్తామన్న అగ్రరాజ్యాధినేత 

కొద్ది గంటల్లోనే ఆ ప్రకటనపై యూటర్న్ 

ఒప్పందాన్ని అధికారికంగా ధ్రువీకరించని ఇరాన్

టెహ్రాన్/వాషింగ్టన్, జూన్ ౧1: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి యూ-టర్న్ తీసుకున్నారు. ఇరాన్‌పై భీకర దాడులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకముందు శాంతి ఒప్పందానికి ఇరాన్ దిగిరాకపోతే గురువారం రాత్రి నుంచే దాడులను తీవ్రతరం చేస్తామని, ఇరాన్‌కు చెందిన చమురు క్షేత్రాలను తమ ఆధీనంలోకి తీసుకుంటామని, వెనిజులా తరహా లో ఇరాన్ చమురు విక్రయాల నియంత్రణను స్వాధీనం చేసుకుంటామని ప్రకటిం చిన ట్రంప్, తర్వాత కొద్ది గంటల్లోనే వెనక్కి తగ్గారు.

ఇరాన్ ఉన్నత స్థాయి నాయకత్వం తో జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయని తెలిపారు. తమ మిత్ర దేశా లు సైతం ఒప్పందానికి ఓకే అన్నాయని వెల్లడించారు. అయితే.. ట్రంప్ ప్రకటన మాత్రం ఇరాన్ ధ్రువీకరించలేదు. మరోవైపు, అమెరికన్ సైన్యం గురువారం ఇరాన్‌లోని రాడార్, ఎయిర్ డిఫెన్స్ నిఘా కేం ద్రాలు, అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థ లు, వైమానిక రక్షణ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 49 తో మహాక్ క్షిపణులను ప్రయోగించింది.

వరుస దాడులతో టెహ్రాన్, సిరిక్, కార్గన్, బందర్ అబ్బాస్, మి నాబ్, వరామిన్, కరజ్ నగరాలు దద్దరిల్లాయి. దాడుల వల్ల సంభవించిన ఆస్తి, ప్రా ణ నష్టం అంచనా వేసే పనిలో ఇరాన్ యం త్రాంగం పడింది. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సైతం ప్రతిదాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించింది.

కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా మిలిటరీ కేంద్రాలపై క్షిప ణులు, డ్రోన్లను ప్రయోగించింది. బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్ బేస్, కువైట్‌లోని అలీ అల్ సలీం ఎయిర్ బేస్‌పై డ్రోన్లు దాడి చేసింది. అలాగే, హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ అనుమతి లేకుండా జలసంధి నుంచి ప్రయాణించే నౌకపై కాల్పులు జరుపుతామని హెచ్చరించింది.

పెరిగిన ఇంధన ధరలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్ అతలాకుతలమైంది. యుద్ధంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికల తర్వాత ఆసియా మార్కెట్లలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు మూడు డాలర్ల చొప్పున పెరిగాయి. ప్రపంచ దేశాలకు అందే చమురు, సహజ వాయువులో దాదాపు ఐదో వంతు గల్ఫ్ ప్రాంతం నుంచే అందుతుంది. కానీ, యుద్ధం కారణంగా సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయి, ఇంధన సంక్షోభానికి దారి తీసింది.

యుద్ధ పరిణామాలపై ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం కారణంగా ఈ ఏడాదిలో అంతర్జాతీయ వృద్ధి రేటు 2.5 శాతానికి పడిపోయిందని పేర్కొంది. ద్రవ్యోల్బణం కూడా సగటున 4 శాతానికి పెరుగుతుందని హెచ్చరించింది. మరోవైపు, చమురు ఉత్పాదక దేశాల సంస్థ ‘ఒపెక్’ కూడా ప్రస్తుత పరిస్థితులపై స్పందించింది. యుద్ధం కారణంగా ఇంధనా సరఫరా అమాంతం పడిపోయిందని తెలిపింది.

నౌకపై అమెరికా క్షిపణి దాడి : ముగ్గురు భారతీయ నావికులు మృతి

  1. మృతుల్లో విశాఖ వాసి సురేష్
  2. దాడిని ఖండించిన భారత్

టెహ్రాన్, జూన్ ౧౧: ఇరాన్ నౌకాశ్రయాల నుంచి చమురు రవాణాను అడ్డుకునేందుకు అమెరికా విధించిన దిగ్బంధం ముగ్గురు భారతీయుల మృతికి కారణమైంది. ఒమన్ తీరంలో గినియా-బిస్సావు దేశ జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంవీ జల్వీర్’ అనే ఆస్ఫాల్ట్ ట్యాంకర్ నౌకపై అమెరికన్ సైన్యం రెండు హెల్‌ఫైర్ క్షిపణులను ప్రయోగించింది. దాడిలో నౌక పూర్తిగా ధ్వంసమైంది. దాడి సంభవించిన సమయంలో నౌకలో 24 మంది భారతీయ నావికా సిబ్బంది ఉండగా, వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో ఏపీలోని విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజినీర్ సురేశ్ (44) కూడా ఉన్నారు. మరో ఇద్దరిని డెక్ క్యాడెట్ ఆదిత్యశర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియాగా గుర్తించారు. అమెరికా దాడిని భారత పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ మంత్రి సర్బానంద సోనోవాల్ ఖండించారు. భారత విదేశాంగ శాఖ న్యూఢిల్లీలోని అమెరికా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌ను అత్యవసరంగా పిలిపించింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులు సరికాదని నిరసన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్ర తా మండలినూ భారత్ ఈ అంశాన్ని లేవనెత్తింది.