సహకరించండి
తెలంగాణ ప్రాజెక్టులను ఆమోదించండి
- గోదావరి జలాలను వినియోగించుకునేలా.. చర్చలకు మహారాష్ట్రను ఒప్పించాలి
- మెట్రో ఫేజ్2 విస్తరణను ఓకే చేయండి
- హైదరాబాద్‌కు ఐఐఎం ఇవ్వండి.. 2౦౦ ఎకరాలు కేటాయిస్తాం
- వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులను ప్రారంభించండి
- దక్షిణ భాగం అలైన్‌మెంట్‌నూ కేంద్ర రవాణాశాఖకు అందజేశాం
- ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమ ర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్ అవ సరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత ముఖ్యమని వివరించారు.
ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం కలిసి రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులకు నిధులు ఇచ్చి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్--2 విస్తరణ ప్రతిపాదనలను ఆమోదిం చాలని కోరారు. ఫేజ్- 2లో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు రూ. 38,595 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మంజూరు చేయాలని కోరారు.
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ పనులకు వెంట నే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర భాగంలో భూసేకరణ ఖర్చులో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, ఎన్‌హెచ్‌ఏఐకి రూ.626 కోట్లు విడు దల చేసినట్టు తెలిపారు. ఉత్తర భాగానికి సంబంధించి 90 శాతానికి పైగా భూసేకరణ అవార్డు పూర్తయిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ట్రిపుల్‌ఆర్‌లో దక్షిణ భాగం నిర్మాణం కూడా అంతే కీలకమని ముఖ్యమంత్రి వివరించారు.
చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు దక్షిణ కారిడార్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ చుట్టూ రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని తెలిపారు. దక్షిణ భాగా నికి సంబంధించిన అలైన్‌మెంట్ మ్యాపు లు, హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్లను ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖకు అందించామని చెప్పారు. ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి, అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నుంచి బందర్ పోర్టుకు..
హైదరాబాద్-, అమరావతి--బందర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వేకు కేంద్రం అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టును కలిపే 12 లేన్ ఎక్స్ ప్రెస్‌వే తెలంగాణకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని చెప్పారు. 120 మీటర్ల రైట్ ఆఫ్ వేతో ప్రతిపాదించిన ఈ హైవే ద్వారా సముద్ర తీరంలేని తెలంగాణకు పోర్ట్ కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ఎగుమతులకు ఇది కీలక మార్గంగా నిలుస్తుందని సీఎం తెలిపారు.
వరంగల్ ఏయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే..
వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులను ప్రారంభించాలన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పటికే అవసరమైన భూసేకరణ పూర్తిచేసి, ఎయి ర్ పోర్ట్ అథారిటీకి అప్పగించామని ప్రధానికి వివరించారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాలకు మరింత లబ్ధి చేకూరుతుందన్నారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలన్నారు.
హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని, ఐఐఎంకు అవసరమయ్యే 200 ఎకరాల స్థలం కేటాయిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద ని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, టీఐఎఫ్‌ఆర్ వంటి ప్రముఖ జాతీయ విద్యాసంస్థలున్నాయని, ఐఐఎం ఏర్పాటు చేస్తే నూతన విద్యావిధానం-2020 ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.






