బర్తరఫ్ పై కొండా సురేఖ స్పందన
హైదరాబాద్: జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఏం నిర్ణయం తీసుకున్నారు? అని కొండా సురేఖ(Konda Surekha) ప్రశ్నించారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన అనంతరం కొండా సురేఖ మాట్లాడుతూ... తనపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఆలోచించుకోలేదన్నారు. బర్తరఫ్(Konda Surekha Suspend) చేయడాన్ని కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. నిర్ణయానికి ముందు తన వివరణ తీసుకోవాల్సిందని తెలిపారు. తన కూతురు వ్యాఖ్యలను తననేలా బాధ్యురాలిని చేస్తారు? అని ప్రశ్నించారు. తన కూతురు స్వతంత్ర మహిళ అన్న కొండా ఆమె వ్యాఖ్యలు ఆమెవే అన్నారు. తన కూతురు వ్యాఖ్యలను తాను ఖండించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తన కూతురు వ్యక్తిగత అభిప్రాయాన్ని తప్పుపట్టే అధికారం తనకు లేదని చెప్పారు. అధిష్ఠానానికి నేను ఇచ్చిన లేఖను మీడియాకు ఇస్తున్నానని పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రివర్గం నుండి దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను గురువారం తొలగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తక్షణమే తొలగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన సిఫార్సును ఇప్పటికే గవర్నర్‌కు పంపారు. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని తక్షణమే రద్దు చేయాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. డాక్టర్ జి. చిన్నారెడ్డి స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా నియమించారు.






