1 July, 2026 | 11:13 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

బ్యూటీ సీక్రెట్ ఇదే!

09-02-2025 12:23 AM

కొంతమంది ముఖంపై ఎంత వెతికినా ఒక్క మొటిమైనా కనిపించదు. ఇక నల్లమచ్చల జాడే దొరకదు. మేకప్ మాయాజాలం లేకుండా సహజంగా బ్యూటీస్‌గా కనిపిస్తుంటారు. నిజానికి అందం వారు పాటించే రోజువారీ అలవాట్లలో ఉంటుందంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.. 

ఉదయం నిద్ర లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు.. ఈ రెండు సందర్భాల్లో ముఖం శుభ్రపరచుకునేవారు చాలా తక్కువమంది. ముఖంపై మొటిమలు రావడానికి ఈ నిర్లక్ష్యమూ ఓ కారణమే అంటున్నారు నిపుణులు.

అందుకే ఈ రెండు సందర్భాలతో పాటు.. చెమట ఎక్కువగా వచ్చినప్పడు తప్పనిసరిగా ముఖం శుభ్రం చేసుకోవాలంటున్నారు. ఫలితంగా ముఖంపై దుమ్ము, జిడ్డుతనం తొలగిపోయి చర్మ రంధ్రాలు మూసుకుపోవు.. తద్వారా మొటిమలూ ఏర్పడవు. 

మొటిమల బాధ లేకుండా ఉండాలంటే.. రోజువారీ తీసుకునే ఆహారం విషయంలోనూ కచ్చితంగా వ్యవహరించాలి. ఈ క్రమంలో కాయగూరలు, ఆలివ్ నూనె, తృణ ధాన్యాలు వంటివి తీసుకోవాలి. వీటి ద్వారా చర్మానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయంటున్నారు నిపుణులు. 

అధిక బరువూ మొటిమల సమస్యకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. శరీరంలో ఆండ్రోజెన్లు, ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలు రావడానికి కారణం అవుతాయి. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఆరోగ్యమే కాదు.. అందం కూడా అంటున్నారు నిపుణులు.