22 May, 2026 | 9:30 PM

Breaking News

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •  

ఇది ప్రజల బడ్జెట్

02-02-2025 02:16 AM
  • దేశాన్ని వికసిత్ భారత్  వైపు అడుగులు వేయిస్తుంది
  • బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. దేశ పురోగతికి దోహదపడే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ని ఆమె బృందాన్ని ప్రధాని అభినందించారు. ‘భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ పద్దు దేశాన్ని వికసిత్ భారత్ వైపు  అడుగులు వేయిస్తుంది.

ఇది ప్రజల బడ్జెట్. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెలవేర్చే విధంగా ఉంది. అనేక రంగాల్లో యవతకు అవకాశాలను కల్పిస్తున్నాం. బడ్జెట్‌లు సాధారణంగా ప్రభుత్వ ఖజానా నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు, సేవింగ్స్ పెంచేందుకు ఉద్దేశించింది. ఈ బడ్జెట్‌లో రూ.12లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదు. అన్ని ఆదాయ వర్గాలకు పన్నులను తగ్గించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది’ అని అన్నారు.