ఇదే సరైంది అనిపించింది!

12-09-2026 | 05:25am

సినిమా(Cinema), బిజినెస్(Business).. ఈ రెండు రంగాల్లో సక్సెస్ ఫుల్ జర్నీ(Successful Journey)ని కొనసాగిస్తున్నారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). ఇప్పటికే ‘రౌడీ వేర్’ ఫ్యాషన్ బ్రాండ్‌('Rowdy Wear' fashion brand)తో యూత్‌ను ఆకట్టుకున్న విజయ్.. ఇప్పుడు ‘అన్ హైప్ (Unhype) అనే స్కిన్ కేర్ బ్రాండ్‌(Skincare brand)ను తను కో ఫౌండర్‌గా, కో బిల్డర్‌గా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “మంచి స్కిన్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ గత కొన్నేళ్లుగా మీరు (అభిమానులు) నన్ను సలహాలు, సూచనలు అడుగుతున్నారు. నా స్కిన్ కోసం నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటానో చెప్పమనేవారు.

మీ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం ఇస్తున్నా. గత తొమ్మిది నెలలుగా ఒక స్కిన్ కేర్ బ్రాండ్ గురించి వర్క్ చేస్తున్నా. మనందరి స్కిన్ కేర్ సొల్యూషన్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నా. అదే ‘అన్ హైప్’. క్వాలిటీలో నాకు నచ్చే స్టాండర్డ్ ప్రాడక్ట్ చేయగలిగాం అని నమ్మేంత వరకు మీకు ఈ విషయాన్ని నేను చెప్పలేదు. నిజంగా మనకు ఉపయోగపడే ప్రాడక్ట్స్, సైన్స్ ఆధారంగా పనిచేసే ప్రాడక్ట్స్, వాటిలో ఉపయోగించే పదార్థాలు, వాటిని టెస్ట్ చేశాక వచ్చే ఫలితాలు.. ఇలాంటి అన్ని విషయాల్లో నేను జాగ్రత్తలు తీసుకున్నాం.

వాటి ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంచాం. మరోవైపు మార్కెట్‌లో ఎన్నో కొత్త కొత్త స్కిన్ కేర్ ప్రాడక్ట్స్ వస్తున్నాయి. ఈ విపరీతమైన పోటీ ఏది కొనాలి అనే సందేహం మనలో కలుగుతుంటుంది. ఈ నేపథ్యంలో సొంత రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, తయారీ చేయగల ఒక టీమ్‌ను నేను కలిశా. ఆ టీమ్ నేను ఈ ప్రాడక్ట్ ప్రచారం మాత్రమే కాదు వారితో కలిసి నిర్మించాలని కోరారు. మీకు ఏదైనా మంచి వస్తువు నేను ఇవ్వాలనుకుంటే ఇదే సరైనది అనిపించింది. ఈ ప్రాడక్ట్స్ తయారు చేశాక 9 నెలలు వాటిని నేను వాడి చూశాను. ఫలితాలు సంతృప్తినిచ్చాకే మీ ముందుకు ఈ ప్రాడక్ట్‌ను తీసుకొస్తున్నా” అని తెలిపారు. 

మరిన్ని వార్తలు