1 August, 2026 | 10:44 AM

టన్ను ‘ఆయిల్‌పాం’కు రూ.15వేలు చేయండి

23-06-2024 12:15 AM

కేంద్రానికి వ్యవసాయ మంత్రి తుమ్మల లేఖ

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి) ః ఆయిల్‌పామ్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించడానికి అయిలఫామ్ గెలలకు కనీస ధరగా టన్నుకు రూ.15వేలు నిర్ణయించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.  క్రూడ్‌పామ్ ఆయిల్ ధర కనీసం టన్నుకు లక్ష ఉండేలా చూడాలని, ముడి ఫామ్ ఆయిల్  ధరల స్థిరీకరణకు దిగుమతి సుంకాన్ని విధించి దేశీయ పామ్ ఆయిల్ రైతులను ప్రోత్సహించాలని కోరారు.  రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు 14 కంపెనీలకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలల ధర టన్నుకు రూ. 13,438 ఉందని, అంతర్జాతీయ మార్కెట్‌లో  తగ్గుతున్న ముడిపామ్ ఆయిల్  ధరలు, వంట నూనెల దిగుమతి సుంకంపై కేంద్రం అవలంబిస్తున్న విధానాలు ఆయిల్ పామ్  సాగుపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం 2021లో ప్రతిపాదించిన వియలబులిటీ గ్యాప్ పౌండింగ్ సూత్రం ప్రామాణికంగా తీసుకోవాలన్నారు.