1 August, 2026 | 11:43 AM

ద్వాదశ రాశిఫలాలు

23-06-2024 12:10 AM

23-.06.-2024 నుండి 29.-06-.2024 వరకు 

రామడుగు రంగన్న సిద్ధాంతి

మేషం:-

ఈ వారంలో ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. నూతన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండా లి. శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. యువతీ యువకులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి పెండ్లి సంబంధాలు దొరుకుతాయి. ఉద్యోగస్తులు సంతోష వార్తలు వింటారు. వ్యాపారస్తులు అధిక లాభాలు పొం దుతారు. విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు. రైతులు సంతోషిస్తారు. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది. 

వృషభం: 

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. యువతీ యువకులకు ఉద్యోగం, పెండ్లి విషయాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు విదేశీ యానం ఫలిస్తుంది. రైతులకు స్వల్పలాభాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. -మొత్తం మీద ఈ వారం ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.- 

మిథునం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఇంట్లో బంధువులతో సందడిగా ఉంటుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో ముందుంటారు. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ధనలాభం పొందుతారు. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది.  

కర్కాటకం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్య రకంగా ఉంది. శుభ కార్యాలు చేస్తారు. కొందరితో భేదాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగం, వివాహ విషయాలలో స్తబ్దత ఉంటుంది. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులు సంతోషకరమైన వార్తలు వింటారు. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో లాభాలు వుంటాయి. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది. 

సింహం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. చేసే పనులలో సమస్యలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులకు చదువులలో స్తబ్దత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారికి 35 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది. 

కన్య:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగం, కోరుకున్న వారితో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. విద్యార్థులకు శుభం కలుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు సంతోషం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది. 

తుల:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. బంధువులతో స్పర్ధలు ఏర్పడతాయి. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు చదువులలో శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పని భారం, ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు అనుకూల కాలం కాదు. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారికి 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది. 

వృశ్చికం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా వుంది. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. ధన వ్యయం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు జాప్యమవుతాయి. విద్యార్థులకు చదువులలో పట్టుదల అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు ఒత్తిళ్లకు లోనవుతారు. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు:-

-ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ధన వ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులలో శ్రద్ధ చూపిస్తారు. వ్యాపారస్తులు, రైతులు చేసే పనులలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పని భారం వున్నా ధనలాభం కలుగుతుంది. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం:--

--ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ధన వ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది.- విద్యార్థులు పట్టుదలతో చదవాలి. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

కుంభం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. మోసాలకు గురవుతారు. ధన వ్యయం అవుతుంది. చేసే పనులలో జాగ్రత్త అవసరం. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో స్తబ్దత ఏర్పడుతుంది. విద్యార్థులకు చదువులలో శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులు, రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ధన వ్యయం అవుతుంది. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.

మీనం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యమంగా ఉంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. ధన వ్యయం అవుతుంది. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులకు చదువులలో అనాసక్తి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు స్వల్పలాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.