వాల్యూగోల్డ్ 5వ బ్రాంచి ప్రారంభం
23-06-2024 12:31 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి): దేశంలోనే ప్రముఖ చారిత్రక బంగార విక్రయ వ్యాపార సంస్థల్లో ఒకటైన ‘వాల్యూగోల్డ్’ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లోని ఉప్పల్, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, సికింద్రాబాద్‌లో బ్రాంచీలు నడుపుతున్నది. చింతల్‌లో ఏర్పాటు చేసిన బ్రాంచిని శనివారం సినీనటి అనసూయ భరద్వాజ్ చేతుల మీదుగా ప్రారంభింపజేసింది. కార్యక్రమంలో ‘వ్యాల్యూగోల్డ్’ ప్రతినిధులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు పాల్గొన్నారు. అలాగే అమీర్‌పేటలోని సారథి స్టూడియోస్ వద్ద రాష్ట్రంలోనే మొదటి సంచార బంగారం కొనుగోలు సేవలను ప్రారంభించింది. బంగారు ఆభరణాలపై రుణాలు పొందాలనుకునే వారికీ సంస్థ అందుకు అనుగుణమైన సేవలు అందిస్తోంది.






