calender_icon.png 27 July, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 కిలోల గంజాయి పట్టివేత... ముగ్గురు అరెస్టు

26-07-2025 06:17:52 PM

హైదరాబాద్: బండ్లగూడ వద్ద గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం శుక్రవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ కమిషనర్ టాస్క్ బృందం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి నివాసితులైన మహ్మద్ షమీరుల్లా బేగ్ (35), బి.రాజేష్(26), ఎస్.నరేష్(29) లను పట్టుకుంది. ఈ ముగ్గురూ రాజమండ్రికి చెందిన రాము అనే వ్యక్తి నుండి గంజాయిని కొనుగోలు చేసి, దానిని కొంతమందికి విక్రయించడానికి కారులో నగరానికి వచ్చారు. అయితే, నిఘా వర్గాల సమాచారం మేరకు బండ్లగూడ వద్ద వారిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి నుండి 25 కిలోల గంజాయిని, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.