ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వ్యక్తులు మృతి
11-06-2025 08:41 AM
- కారును ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు
- విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం
- యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
యాచారం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District), యాచారం పోలీస్ స్టేషన్ పరిధి సాగర్ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఏడుగురు స్నేహితులు మంగళవారం సాగర్ వైజాగ్ కాలని విహారయాత్రకు వెళ్ళి, కియా కార్ లో హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా, అర్ధరాత్రి మార్గం మధ్యలో మాల్ వద్ద ఎదురుగా వచ్చిన గిరిధర్ ట్రావెల్స్ బస్సు, కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న పవన్ కుమార్, పవన్, రాఘవేంద్ర ఈ ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






