calender_icon.png 31 January, 2026 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం

31-01-2026 11:28:04 AM

హైదరాబాద్: రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. చర్లపల్లి-ఘట్కేసర్ స్టేషన్ల(Charlapalli-Ghatkesar stations) మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన సురేందర్ రెడ్డి, విజయ, చేతనరెడ్డిగా  గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ విషాదఘటనపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు వెల్లడించారు.