సునీత సమక్షంలో రవితేజ రెడ్డి జన్మదిన వేడుకలు
కొల్చారం: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, పైతర గ్రామ సర్పంచ్ యాబన్నగారి రవితేజ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కేక్ కట్ చేయించి రవితేజ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి రవితేజ రెడ్డి అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, అభిమానులు రవితేజ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.






