26 July, 2026 | 6:59 PM

ముష్టిబండలో సత్తుపల్లి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

26-07-2026 05:56 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని ముష్టిబండ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వెళ్తున్న సత్తుపల్లి డిపో ఆర్టీసీ బస్సును లారీ అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు కాగా మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ లో బాధితులను దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మొండివర్రెలో ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి

దమ్మపేట మండల పరిధిలోని మొండివర్రే, సీతారాం ప్రాజెక్టు కాలువ వంతెన దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.