బీజేపీ జిల్లా కమిటీలో ముగ్గురికి చోటు
కందుకూరు, మార్చి 15 (విజయక్రాంతి): బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, సంఘటన మంత్రి చంద్ర శేఖర్ జీ,రాష్ట్ర బీజేపీ ఇంచార్జి అభయ్ పాటిల్ ల ఆదేశాల మేరకు బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ ప్రకటించిన జిల్లా కమిటీలో కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామానికీ చెందిన ఎల్మటి దేవేందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ముచ్చర్ల గ్రామానికీ చెందిన తేరేటి లక్ష్మణ్ ముదిరాజ్ జిల్లా ఉపాధ్యక్షులుగా, కొత్తగూడ గ్రామానికీ చెందిన సాధ మల్లారెడ్డి జిల్లా మీడియా కన్వీనర్ లుగా నియమితులైనట్టు జిల్లా అధ్యక్షుడు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ, కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డికి,చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి,బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ కీ,జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నరసింహ రెడ్డికి,మహేశ్వరం అసెంబ్లీ ఇంచార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందేల శ్రీరాములు యాదవ్ లకీ ధన్యవాదాలు తెలిపారు.




