16 March, 2026 | 4:06 AM

వైభవంగా మల్లికార్జునస్వామి కల్యాణం

16-03-2026 01:19 AM

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రత్యేక పూజలు

ఘట్ కేసర్, మార్చి 15 (విజయక్రాంతి): మేడ్చల్ నియోజకవర్గం పోచారం డివిజన్ పరిధి ప్రతాపసింగారం లోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం మల్లన్న కల్యాణ మహోత్సవo అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచరణాల మధ్య మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రరెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ లు వెంకట్ రెడ్డి, వెంకటేష్, శివశంకర్, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు, రమేష్, కొండల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.