16 March, 2026 | 5:09 AM

ఘనంగా మహిళా దినోత్సవం

16-03-2026 01:17 AM

ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

శేరిలింగంపల్లి,మార్చి 15 (విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు, పురుషోత్తం ఆధ్వర్యంలో మహిళల కోసం విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గత 15 రోజులుగా మియాపూర్ పరిధిలోని వివిధ కాలనీలలో మహిళల కోసం వినోదాత్మక గేమ్స్, ప్రతిభా పోటీలు నిర్వహించి మహిళలలోని ప్రతిభను వెలికితీయడానికి ప్రత్యేక ప్రయత్నం చేశారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేతుల మీదుగా ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ కె మధుసూదన్, అర్జున అవార్డు గ్రహీత జీవంజీ దీప్తి, డాక్టర్ జెబి రావు మియాపూర్ లా అండ్ ఆర్డర్ ఎస్.ఐ వెంకటేష్, కిమ్స్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్య ప్రియ, మియాపూర్ జడ్పీహెచ్‌ఎస్ ప్రిన్సిపాల్ వసుంధర, మహిళా కాంగ్రె స్ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్ బోయిని మహేష్ యాదవ్, నిమ్మల రామకృష్ణ గౌడ్, మోహన్ ముదిరాజ్, మువ్వ సత్యనారాయణ, పురుషోత్తం యాదవ్, ఓం ప్రకాష్, కృష్ణ పటేల్,డిఎస్ ఆర్ కె ప్రసాద్, బాబ్జి, సుధీర్, వినయ్ ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్, తదితర ప్రముఖులు ఏ ఆర్ పి టీం సబ్యులు, అట్టేపల్లి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.