15 June, 2026 | 6:34 PM

Breaking News

ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •   ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •  

థ్రిల్లింగ్ బ్రేకింగ్ న్యూస్

19-04-2026 12:08 AM

మురళీమోహన్, హీరోయిన్ అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘ది బ్రేకింగ్ న్యూస్’. ఈ చిత్రానికి పవన్ కడియాల రచనాదర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

మీడియా నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాను మే నెలలో థియేటర్ల ద్వారా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శశి ప్రీతమ్; సినిమాటోగ్రఫీ: సాయినాథ్; ఎడిటర్: శిరీష్ ప్రసాద్.