15 June, 2026 | 7:35 PM

Breaking News

హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •  

ప్రశాంత్ నీల్ సమర్పణలో..

19-04-2026 12:10 AM

 ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ యంగ్ స్టర్స్‌తో ఓ సరికొత్త హర్రర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్యరాజ్ వీరబత్తిని, హనురెడ్డి, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి ‘418’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మేకర్స్ విడుదల చేసిన టైటిల్ పోస్టర్ సినిమా కథపై క్యూరియాసిటీ పెంచుతోంది. భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. సైన్స్ మిస్టరీ, సైన్స్, మూఢనమ్మకానికీ అర్థం కాని ఒక రహస్యంతో ఇప్పటివరకూ చూడని సరికొత్త కథతో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది.

ఈ చిత్రానికి సంగీతం: వెంకీ జీజీ; డీవోపీ: దినేశ్ దివాకరన్; డైలాగ్స్: మోహన్ బీఎస్; ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదూర్; సమర్పణ: ప్రశాంత్ నీల్; నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్; దర్శకత్వం: కీర్తన్ నాదగౌడ.