నేడు 2000 స్కూళ్లలో ‘టిఫిన్ బైఠక్’లు
- రేపు ‘స్వచ్ఛ పాఠశాల’ పేరుతో క్లీనింగ్
- ఊరూవాడా కదలిరావాలి: బండి సంజయ్
కరీంనగర్, జూన్ 11 (విజయక్రాంతి): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈనెల 13న “స్వచ్చ పాఠశాల పేరుతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభు త్వ పాఠశాలలను శుభ్రం చేయాలంటూ వినూ త్న రీతిలో కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.
శుక్రవారం ఉదయం 9 గంటలకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని స్కూళ్లలో ‘టిఫిన్ బైఠక్’ పేరుతో ఆయా గ్రామాల ప్రజలు, వివిధ పార్టీల కార్యకర్తలు, స్వచ్చంద సంస్థలు రాజకీయాలకు అతీతంగా సమావేశం కానున్నారు. ఎవరి సద్ది వాళ్లే తెచ్చుకుని అందరూ స్కూల్ ఆవరణలో ఒకే చోట చేరి స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి? ఎవరు ఏ తరగతి గదిని శుభ్రం చేయాలి? అనే అంశంపై చర్చించనున్నారు.
‘బడి మనది.. ఆ బడిని కా పాడుకోవాల్సిన బాధ్యత మనందరిది.. ఊరూవాడా కదలి వచ్చి “స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు సహా ప్రతి ఒక్కరూ కదలి రావాలని బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కాగా జమ్మికుంట శిశు మందిర్ పాఠశాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లతోపాటు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమావేశమై మోదీ పాలనలో ఆరోగ్య రంగంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని కోరారు.
ఈ సమావేశంలో ఐఎంఏ హుజూరాబాద్, జమ్మికుంట ప్రెసిడెంట్ డాక్ట ర్ కె.తిరుపతి, ఎథిక్స్ ఛైర్మన్ సీహెచ్.శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ బి.రమేశ్, పి.శ్రీకాంత్, కె.దేవేందర్ రెడ్డి, మురళి, ప్రవీణ్, సంపత్, సాయి, కిశోర్, ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు. జమ్మికుంటలోని పాకాల రవీందర్‌రెడ్డి నివాసంలో పలు వురు ప్రముఖులను కలిశారు. మోదీ 12 ఏళ్ల పాల నా విజయాలపై ముద్రించిన పుస్తకాల ను వారికి అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షు లు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ నేతలున్నారు.






