17 April, 2026 | 8:49 PM

17 నుంచి తిరంగా యాత్రలు

15-05-2025 01:18 AM

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): ఆపరేషన్ సిందూర్ విజయ వంతమైన సందర్భంగా దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని, అం దులో భాగంగా రాష్ర్టంలో తెలంగాణలో సిటిజన్స్ ఫోరం ఫర్ నేషనల్ సెక్యూరిటీ సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.

బుధవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు.. మే 17 సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి తిరంగా యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. మే 18, 19, 20 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రా ల్లో, మే 21, 22, 23 తేదీల్లో అన్ని మున్సిపాలిటీలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరంగా యాత్రలు నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమాలకు బీజేపీ పూర్తిస్థాయి మద్దతు తెలిపి, స్వయంగా పాల్గొంటుందన్నారు. తెలంగాణ ప్రజలంద రూ తిరంగా యాత్రలో పాల్గొని, భారత సైనికులకు వందనాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.