7 July, 2026 | 7:31 PM

Breaking News

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •   ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు   •  

తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

14-10-2024 06:53 PM

విజయవాడ: తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనాలపై తుఫాన్ ప్రభావం పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎల్లుండి వీఐపీ బ్రేక్ దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. కొండకు వచ్చిన భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనుంది.  ఘాట్ రోడ్డులో కొండచరియలపై నిఘా ఉంచాలి.. జేసీబీలు, అంబులెన్స్‌లు సేవలు సిద్ధంగా ఉంచాలని ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. అటు ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 17 వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ ఈ నాలుగు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. 

ఆంధ్రప్రదేశ్ తుఫాన్ పరిస్థితులపై మంత్రి నారాయణ సోమవారం సాయంత్రం సమీక్షించారు. మున్సిపల్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుఫాన్ చెన్నై-నెల్లూరు మధ్య ఈ నెల 17న తుఫాన్‌ తీరం దాటుతుందని అంచనా వేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.