7 July, 2026 | 7:37 PM

Breaking News

ఐకెపి రుణాలలో తాండూర్ అత్యధిక ఓవర్ డ్యూ   •   సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •  

ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు

07-07-2026 06:49 PM

చందుర్తి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణలతో పాటు ఆగ్రో రైతు సేవా కేంద్రంలో టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలోని స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డులు, ఇన్వాయిస్ లను పరిశీలించారు. అలాగే రైతులకు విక్రయించే విత్తనాల గడువు తేదీలను తనిఖీ చేసి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాల విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే అంశాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ తనిఖీల్లో  చందుర్తి మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు మరియు చందుర్తి ఎస్సై జిల్లెళ్ళ రమేష్ పాల్గొని దుకాణం రికార్డులను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.