10 July, 2026 | 10:16 PM

రావురూకుల రెడ్డి సంఘం అధ్యక్షుడిగా తిరుపతిరెడ్డి

10-07-2026 09:27 PM

నూతన కమిటీ ప్రమాణస్వీకారం.. 

అభివృద్ధికి కృషి చేస్తానన్న అధ్యక్షుడు

సిద్దిపేట రూరల్: రావురూకుల గ్రామ రెడ్డి సంఘం నూతన అధ్యక్షుడిగా గొట్టం తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా గడ్డం మహేందర్‌రెడ్డి, కోశాధికారిగా పులగుల మధుకర్‌రెడ్డి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన సంఘం ఎన్నికల్లో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సహకారంతో గ్రామ రెడ్డి సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి నూతన కమిటీ సభ్యులను సన్మానించి అభినందించారు. రెడ్డి సంఘం అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అనంతరం రెడ్డి సంఘం ప్రతినిధులు మారెడ్డి రవీందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.